ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్ధుల అరెస్ట్
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు నిర్వహించిన శాంతిర్యాలీలో 18మంది భారతీయులను అరెస్టు చేసినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించడంతో పాటు స్థానిక వ్యాపారాలకు తీవ్ర ఇబ్బందులు కల్గించారనే నెపంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులకు పూర్తి స్థాయి భద్రతా కల్పించడానికి అధికారులతో చర్చిస్తున్నామని భారతీయ కాన్సులేట్ జనరల్ అనితా నాయర్ తెలిపారు. శాంతిర్యాలీని తాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించానని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. విద్యార్థుల అరెస్టుకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications