హైదరాబాద్: వచ్చే ఐదేళ్లలో కోటి ఎకారాలకుపైగా సాగునీరు పదివేల మెగావాట్ల అదనపు విద్యుత్తు ఉత్పత్తే తమ ప్రభుత్వ లక్ష్యమని వైఎస్ సర్కారు స్పష్టం చేసింది. నిన్న జెరూసలేం పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన ముఖ్యమంత్రి సోమవారం ఓ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. వచ్చే ఐదేళ్లలో 59 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి, ఆరు భారీ ప్రాజెక్టులను కేంద్రం జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు.