చంద్రబాబుకి జయప్రకాష్ కౌంటర్

రాజమండ్రిలో ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటర్లను డబ్బుతో, మద్యంతో కొనేవారు టెర్రరిస్టుల కంటే ద్రోహులని పేర్కొన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఓట్లు పొందాయా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేం దుకు లోక్ సత్తా పార్టీ సహకరించిందన్న నన్నపనేని రాజకుమారి చేసిన ఆరోపణపై జయ ప్రకాష్ తీవ్రంగా స్పందిస్తూ అది అవాస్తవం, అసంబద్ధ ఆరోపణ అని అన్నారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభా లకు గురి చేయకుండా వంద ఓట్లకు సగ టున ఐదు ఓట్లను పొందామని, దీనికే అన్ని పార్టీలు బెంబేలెత్తుతున్నాయని ఆయన అన్నారు.
అలాగే కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు ఉగ్రవాదుల కంటే ప్రమాదక రమైనవని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఈ పార్టీలు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమైనవనడంలో అతిశయోక్తి లేదని అన్నారు.అటువంటి సంప్ర దాయక పార్టీలను పాతిపెట్టడం ద్వారా రాజకీ యాలను ప్రక్షాళన చేసి 2014 నాటికి లోక్‌సత్తా ఆశించినమార్పును తీసుకొస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications