ర్యాగింగ్ కి హోం మంత్రి చెక్
హైదరాబాద్: రోజురోజుకీ పెరిగిపోతున్న ర్యాగింగ్ కేసులను నిరోధించేందుకు రాష్ట్ర హోం మంత్రి పి.సబితారెడ్డి నడుం బిగించారు. త్వరలోనే ర్యాగింగ్ నిరోధానికి ప్రత్యేక హెల్ప్ లైన్ ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహేశ్వ రం నియోజకవర్గంలోని కొత్తపేట్‌లో మహిళా సంఘాలు తనకు జరిపిన సన్మాన కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈవ్ టీజింగ్ బారిన పడుతున్న మహిళల్లో చాలా మంది పోలీస్ స్టేషన్ వరకు వచ్చి ఫిర్యాదు చేయలేక పోతున్నారని అన్నారు.
మరికొందరు బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలంటే భయపడుతున్నారని సబితారెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా రోజురోజుకు విస్తరిస్తున్న ర్యాగింగ్ బాధితుల్లో కూడా పలువురు ధైర్యంగా ఫిర్యాదు చేయలేక పోతున్నారని అన్నారు. ఇలాంటి వారి కోసం రాష్టవ్య్రాప్తంగా ఓ హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సబితారెడ్డి ప్రకటించారు. అతి త్వరలోనే హెల్ప్ లైన్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications