డిప్యూటీ స్పీకర్ కోసం కూటమి పట్టు
హైదరాబాదు: స్పీకర్ పదవికి పోటీ పడి చివరికి తప్పుకున్న టీడిపీ డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీలోని చంద్రబాబు చాంబర్‌లో ఇవాళ మహాకూటమి నేతలు సమావేశమయ్యారు. సిఎం, స్పీకర్ పదవుల్లో ఒకే ప్రాంతానికి చెందినవారున్నారని, డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకివ్వాలని టీఆర్‌ఎస్, టీడీపీలు పట్టుబడుతున్నాయి. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల్లో ఒక్కటి కూడా తెలంగాణ ప్రాంతానికి కేటాయించకపోవడం దురదృష్ట కరమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈ టెల రాజేందర్ అన్నారు.












Click it and Unblock the Notifications