హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ స్థానికుడికి స్వైన్ ఫ్లూ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్ లో మరో స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. దీంతో హైదరాబాదులో ఇప్పటి వరకు నాలుగు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఆరు స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా వాటిలో నాలుగు హైదరాబాదుకు చెందినవి కావడం విశేషం. తాజాగా హైదరాబాదులోని స్థానిక యువకుడు స్వైన్ ఫ్లూ వ్యాధికి గురయ్యాడు. స్థానిక వ్యక్తికి స్వైన్ ఫ్లూ సోకడం దేశంలో ఇదే తొలిసారి.

గత నెల 31వ తేదీన అమెరికా నుంచి లండన్ ద్వారా ఒక యువకుడు హైదరాబాద్ వచ్చాడు. అతను రెండు రోజుల పాటు ఒక ఇంట్లో గడిపాడు. ఆ తర్వాత అతనికి స్వైన్ ఫ్లూ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. అతను ఆస్పత్రిలో చేరాడు. అతని ద్వారా అతను గడిపిన ఇంట్లోని యువకుడికి స్వైన్ ఫ్లూ సోకినట్లు అనంతరం తేలింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X