విషం తాగి చస్తా: శరద్ యాదవ్

Sharad Yadav
న్యూఢిల్లీ: మహిళా బిల్లును ఇప్పుడున్న రూపంలోనే ఆమోదిస్తే తాను సభలోనే విషం తాగి చస్తానని జేడీ(యు) అధినేత శరద్‌ యాదవ్‌ హెచ్చరించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం చర్చలో ఆయన మాట్లాడారు. "మాకు సంఖ్యాబలం లేకపోవచ్చు. విషం తాగి చావనైనా చస్తా కాని ఈ బిల్లును మాత్రం ఆమోదం పొందనీయను" అని స్పష్టం చేశారు. కంటి తుడుపు చర్యగానే కాంగ్రెస్‌ మహిళా రిజర్వేషన్‌ బిల్లును పెడుతోందని ఆరోపించారు. "రాష్ట్రపతిగా, స్పీకరుగా మహిళల్ని నియమించడం కూడా కంటి తుడుపు చర్యే" అన్నారు. వాస్తవానికి వెనుకబడిన, బాగా వెనకబడిన మహిళలకు కావాల్సింది దుర్భర పరిస్థితుల నుంచి వారికి విముక్తి కల్గించడమే అని ఆయన స్పష్టం చేశారు.

మహిళా సాధికారత విషయంలో కాంగ్రెస్‌ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తొలుత ముస్లిం మహిళలకు పర్సనల్‌ లా సంకెళ్ల నుంచి విముక్తి కల్గించాలని డిమాండ్‌ చేశారు. గురువారం రాష్ట్రపతి ప్రసంగంలో హామీ ఇచ్చినట్లుగా ధైర్యముంటే 100 రోజుల్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని సవాలు విసిరారు. ప్రభుత్వానికి 80 మంది ఎంపీలు బయటనుంచి మద్దతిస్తున్నారన్న సంగతి మరవొద్దని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+