ఫ్రెంచ్ మహిళపై అత్యాచార యత్నం
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక ఫ్రెంచ్ మహిళపై వార్డ్ బాయ్ అత్యాచార యత్నానికి పాల్పడినట్లు పోలీసులు సోమవారం చెప్పారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన ఆ మహిళపై అతను అత్యాచార యత్నం చేసినట్లు వారంటున్నారు. వార్డ్ బాయ్ రన్వీర్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేసి అతనిపై అత్యాచార యత్నం కేసు నమోదు చేశారు.
22 ఏళ్ల ఫ్రెంచ్ యువతి హీథర్ బేట్స్ తన బ్రిటిష్ మిత్రుడు జేమ్స్ హాకిన్స్ తో కలిసి రైల్లో పాట్నా వెళ్తుండగా ఆహారం తిన్నది. దాంతో ఆమె అస్వస్థతకు గురై ఆమె కాన్పూర్ లోని రైల్వే ఆస్పత్రిలో చేరింది. అక్కడి నుంచి ఆమెను శనివారం ప్రభుత్వ ఆధ్వర్యంలోని హాలెట్ ఆస్పత్రికి తరలించారు.ఐసియులో చేరిన బేట్స్ గత రాత్రి వార్డ్ బాయ్ తనపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడని ఆరోపించింది. దాంతో పోలీసులకు వైద్యులు సమాచారం అందించారు. అస్వస్థతకు గురైన వారిద్దరి పరిస్థితి మెరుగవుతోందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications