లోకసభ ఉప సభాపతిగా ముండా

సంప్రదాయాన్ని పాటించే ఉద్దేశంతో ఉప సభాపతి పదవిని యుపిఎ ప్రభుత్వం ప్రతిపక్షాలకు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. దీంతో బిజెపి ఉప సభాపతి పదవికి కరియా ముండా పేరును ఖరారు చేసింది. గిరిజన నాయకుడైన ముండా జార్ఖండ్ నుంచి ఆరుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. వాజ్ పేయి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కూడా పని చేశారు. 1936లో ఇప్పటి జార్ఖండ్ రాజధాని అయిన అప్పటి బీహారు రాష్ట్రంలోని రాంచీలో జన్మించిన ఆయన పోస్టు గ్రాడ్యుయేషన్ లో పట్టా తీసుకున్నారు.












Click it and Unblock the Notifications