కౌలాలుంపూర్ లో శ్రీకాంత్ ఆచూకీ
ఖమ్మం: మలేసియాలో తప్పిపోయిన ఆడెపు శ్రీకాంత్ ఆచూకీ దొరికింది. అతను కొద్ది కాలం క్రితం తప్పిపోయాడు. అతనికి కౌలలంపూర్ అస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. అతను ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందినవాడు. శ్రీకాంత్ ను ఖమ్మం జిల్లాలోని అతని తల్లిదండ్రులతో మాట్లాడించారు. 23 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీకాంత్ దాదాపు 18 రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. శ్రీకాంత్ కౌలాలంపూర్ లోని కెఐఎస్ ఎల్ లో పనిచేస్తున్నాడు.
శ్రీకాంత్ మే 22వ తేదీన కార్యాలయం నుంచి వెళ్లిపోయాడని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని కంపెనీ అధికారులు శ్రీకాంత్ తల్లిదండ్రులు సక్కుబాయి, కనకయ్యలకు తెలిపారు. శ్రీకాంత్ ఆ రోజు కార్యాలయానికి వెళ్లిపోయిన తర్వాత కనిపించలేదని అతని రూమ్మేట్ శ్యాం కూడా చెప్పాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్తగూడెం వెళ్లిపోదలుచుకున్నట్లు శ్రీకాంత్ తన బంధువు సతీష్ తో మే 10వ తేదీన చెప్పాడు. అయితే కంపెనీ తన రాజీనామాను ఆమోదించడం లేదని కూడా అతను చెప్పాడు. దాంతో అతని అదృశ్యం వెనక కంపెనీ హస్తం ఉండవచ్చునని శ్రీకాంత్ తల్లిదండ్రులు అనుమానిస్తూ వచ్చారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications