కాంగ్రెస్ డబ్బు పంపిణీ: దగ్గుబాటి
హైదరాబాద్: ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు డబ్బులు పంపిణీ చేశాయని, అందుకు తమ పార్టీ మినహాయింపేమీ కాదని కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు అన్నారు. ఎన్నికల కమిషన్ తలుచుకుంటే దాన్ని అరికట్టడం పెద్ద కష్టమేమీ కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
డబ్బులు పంచి గెలిచిన శాసనసభ్యులను ఒక్కర్నో ఇద్దర్నో తొలుతు అనర్హులుగా ప్రకటిస్తే ఎన్నికల్లో డబ్బుల పంపిణీ తగ్గుతుందని ఆయన అన్నారు. ఎన్నికల్లో చాలా కఠినంగా వ్యవహరించిందని చెబుతున్న ఎన్నికల సంఘం డబ్బుల పంపిణీని మాత్రం ఆపలేకపోయిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications