ఆస్ట్రేలియన్ పై ప్రతీకార దాడి
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో కొన్ని వారాలుగా భారతీయ విద్యార్థులు లక్ష్యంగా వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా అనూహ్య సంఘటన జరిగింది. ఒక భారత విద్యార్థుల బృందంపై జాతివివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసిన అనంతరం 20 ఏళ్ల ఆస్ట్రేలియన్ ఒకతను కత్తిపోట్లకు గురయ్యాడు. ఆదివారం రాత్రి మెల్‌బోర్న్ నగర పశ్చిమ శివారులో ఈ సంఘటన చోటుచేసుకొంది. దీనిని తమపై దాడులకు వ్యతిరేకంగా ఇక్కడి భారతీయులు చేసిన తొలి ప్రతీకార దాడిగా భావిస్తున్నారు.
భారతీయులపై వరుస దాడుల నేపథ్యంలో న్యూఢిల్లీ ఆగ్రహాన్ని చల్లార్చేందుకా అన్నట్లు కెవిన్ రుడ్ ప్రభుత్వం ఒక భారతీయ ఆస్ట్రేలియన్ ను భారత్ లో తమ తదుపరి హైకమిషనర్ గా నియమించింది. కత్తిపోట్లకు గురైన ఆస్ట్రేలియా యువకుడు అంతకుముందు భారత విద్యార్థులనుద్దేశించి జాతివివక్షతో దుర్భాషలాడినట్లు సమాచారం. "మీరు నల్లజాతీయులు. మీరు ఇక్కడివాళ్లు కాదు. మా దేశం నుంచి వెళ్లిపోండి" అంటూ వారిని అతడు దూషించినట్లు 'ది ఏజ్' పత్రిక వెల్లడించింది. ఈ సంఘటనకు సంబంధించి 23 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న ఇద్దరు ముదురు రంగు యువకుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications