కెనడాలో భారతీయులపై దాడి
వాంకోవర్: ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై జాతి వివక్ష దాడులు కలవరపెడుతుండగానే కెనడాలో కూడా అటువంటి దాడులు మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి. వాంకోవర్ శివారులోని లాంగ్లైలో కొంత మంది భారతీయులపై నలుగురు శ్వేత జాతి కెనడియన్లు దాడి చేశారు. ఈ విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. వారాంతంలో ఆరుగురు భారతీయులు టెన్నిస్ ఆడుతుండగా నలుగురు వ్యక్తులు జాతి వివక్షతో దుర్భాషలాడుతూ వచ్చారు. వారు ఫెన్స్ బోర్డును తొలగించి అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరించారు.
దాడి చేసినవారిలో ముగ్గురు యువకులు, ఒక యువతి ఉన్నారు. వారు టెన్నిస్ కోర్టులోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో భారతీయులు భయంతో ఒక మూలకు ఒదిగారు. టెన్నిస్ ఆటగాళ్లపై వారు ఫెన్స్ బోర్డు విసిరారు. దాంతో ఒక వ్యక్తి తలకు గాయమైంది. వారు బాధితుల వస్తువులను ఎత్తుకెళ్లారు.
వారిని పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి భారతీయులకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 19 ఏళ్ల రోడ్నీ మెర్సీకాతో పాటు మరో ముగ్గురిని ఈ నెల 12వ తేదీ వరకు పోలీసు కస్టడీకి పంపారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications