చెన్నైలో అమెరికా జాతీయుడి అరెస్టు
చెన్నై: చెన్నైలోని విమానాశ్రంయంలో అమెరికా జాతీయుడిని అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. లోడెడ్ రివాల్వర్ కలిగి ఉన్నందుకు సెమిలార్ అనే 58 ఏళ్ల అమెరికా జాతీయుడిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. దేశీయ విమానాశ్రయంలో ముంబయికి చెందిన విమానం ఎక్కబోతుండగా కేంద్ర పారిశ్రామిక, భద్రతా బలగాల అధికారులు సెమిలార్ బ్యాగేజీని స్కాన్ చేశారు. అప్పుడు రివాల్వర్ బయట పడింది.
రివాల్వర్ ను అతను విమానాశ్రయం అధికారులకు అప్పగించినట్లు సిఐఎస్ ఎఫ్ అధికారులు చెప్పారు. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం సెమిలార్ ఢిల్లీ నుంచి గత వారం చెన్నైకి వచ్చారు. అమెరికా ఇచ్చిన లైసెన్స్ సెమిలార్ రివాల్వర్ కు ఉందని ప్రాథమిక విచారణ తేలినట్లు వారు తెలిపారు. అతని అరెస్టుపై అమెరికన్ కాన్సులేట్ కు తెలియజేశారు.
Comments
Story first published: Thursday, June 11, 2009, 14:45 [IST]