హీథర్ తాంత్రిక్ సెక్స్ పై దుమారం
న్యూయార్క్: హాలివుడ్ నటి హీథర్ గ్రాహం తాంత్రిక సెక్స్ పై చేసిన వ్యాఖ్య హిందువుల మనోభావాలను దెబ్బ తీశాయి. హిందువుల తాంత్రిక సంప్రదాయాన్ని ఆ నటి కేవలం శృంగారానికి మాత్రమే అన్వయించడం ద్వారా తమ మనోభావాలను దెబ్బ తీసినట్లు అమెరికాలోని హిందువులు విమర్శిస్తున్నారు. హాలీవుడ్ పెద్దలు హిందుత్వను స్వీకరించడానికి తమకేమీ అభ్యంతరం లేదని, అయితే దాన్ని సీరియస్ గా చేయాలని, కేవలం ఫ్యాషన్ కోసం చేసే విధంగా ఉండకూడని నేవడాలోని అమెరికన్ హిందూ పూజారి రజన్ జెడ్ ఒక ప్రకటనలో అన్నారు.
ఆత్మశోధనకు తంత్రం ఒక చైతన్యపూరితమైన విధానమని ఆయన అన్నారు. హిందూత్వం చాలా పురాతనమైందని, ప్రపంచంలో మూడో అతి పెద్ద మతమని, దాన్ని ఆషామాషీగా తీసుకోకూడదని ఆయన అన్నారు. తాంత్రిక్ సెక్స్ పట్ల తన ప్రేమను, ప్రశంసను ఒక ఇంటర్వ్యూలో గ్రాహం వెల్లడించారు. గ్రాహం, ఇతర హాలీవుడ్ సెలిబ్రిటీలు తాంత్రిక్ సెక్స్ కు దుర్యాఖ్యలు చేస్తున్నారని జెడ్ అన్నారు. హిందూత్వంలోనే కాకుండా జైన, బౌద్ధ మతాల్లో కూడా తాంత్రికతకు అత్యంత ప్రాధాన్యం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications