ఓం ప్రకాష్ కు తీవ్ర అస్వస్థత
హైదరాబాద్: మొద్దు శీను హత్య కేసులో నిందితుడు ఓం ప్రకాష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రెండు మూత్ర పిండాలు కూడా చెడిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. అతను ప్రస్తుతం హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రి అత్యవసర సేవల విభాగంలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయితే రెండు మూడు రోజుల తర్వాత గాని ఏ విషయమూ చెప్పలేమని వైద్యులు అంటున్నారు.
అనంతపురం జైలులో ఉన్న ఓం ప్రకాష్ ను ఆరోగ్యం చెడిపోవడంతో మూడు రోజుల క్రితం హైదరాబాదులోని చర్లపల్లి జైలుకు తరలించారు. అతన్ని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. అనుమతి లేదంటూ ఓంప్రకాష్ ను కలవడానికి పోలీసులు మీడియా ప్రతినిధులను అనుమతించడం లేదు. పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మొద్దు శీను దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. మొద్దు శీను హత్య కేసులో ఓంప్రకాష్ నిందితుడు.












Click it and Unblock the Notifications