ఆసీస్ లో మరో భారత విద్యార్థిపై దాడి
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై మరో జాతి వివక్ష దాడి జరిగింది. అడిలైడ్ లో 22 ఏళ్ల భారత విద్యార్థిపై తాజాగా దాడి జరిగింది. దాడిలో ఆ విద్యార్థి ముక్కు పగిలిపోయిందని పోలీసులు చెప్పారు. అడిలైడ్ లోని రద్దీ మార్కెట్ ప్రాంతమైన రండ్లులో ఈ దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి 17 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దాడులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థులు మెల్బోర్న్, సిడ్నీల్లో వరుసగా ర్యాలీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ తాజా దాడి జరిగింది. తన టర్బన్ పై దురుసుగా వ్యాఖ్యలు చేస్తూ తన యువకుడు వివాదానికి దిగినట్లు దాడికి గురైన యువకుడు చెప్పినట్లు స్థానిక మీడియా పేర్కొంది.












Click it and Unblock the Notifications