శాస్త్రవేత్త అన్వేషణలో ఐబి కూడా
కైగా (కర్ణాటక): నాలుగు రోజుల నుంచి కనిపించకుండాపోయిన కైగా అణు విద్యుత్ సంస్థ శాస్త్రవేత్త కోసం సీఐఎస్ ఎఫ్, స్థానిక పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ రెండు సంస్థలకు ఇప్పుడు ఇంటలిజెన్స్ బ్యూరో తోడైంది. కైగా టౌన్ షిప్ లో ఈ నెల ఎనిమిదిన ఉదయపు నడక (మార్నింగ్‌వాక్)కు వెళ్లిన శాస్త్రవేత్త ఎన్.మహాలింగం(47) అప్పట్నుంచి కనిపించడం లేదు. దీంతో సీఐఎస్ ఎఫ్, స్థానిక పోలీసులు 40 మంది బృందంగా ఏర్పడి గాలిస్తున్నట్లు ఉత్తర కన్నడ ఎస్పీ రమణ్ గుప్తా తెలిపారు.
అణు విద్యుత్ కేంద్రంలో అనుకరణ యంత్ర శిక్షణ విభాగంలో పనిచేసే మహాలింగాన్ని అపహరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.ఐబి, సిఐఎస్ ఎఫ్, స్థానిక పోలీసు విభాగం శాస్త్రవేత్త కోసం ఉమ్మడి గాలింపు చర్యలు చేపట్టాయి. శాస్త్రవేత్తను ఎవరైనా అపహరించి ఉంటారా అనే కోణం నుంచి కూడా గాలింపు జరుగుతోంది.












Click it and Unblock the Notifications