పాక్ లోనే లాడెన్: సిఐఎ
వాషింగ్టన్: ఆల్ ఖైదా ఉగ్రవాద నేత ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్ లోనే ఉన్నట్లు తాను నమ్ముతున్నట్లు అమెరికా గూఢచార సంస్థ సిఐఎ డైరెక్టర్ లియోన్ పానెట్టా చెప్పారు. లాడెన్ దాగి ఉన్నాడని భావిస్తున్న గిరిజన ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో సిఐఎ ఆల్ ఖైదా నేత లాడెన్ ఆచూకీ కోసం కన్నేసి ఉంచింది.
కాపిటోల్ హిల్ లో ప్రసంగించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. లాడెన్ ఆచూకీ కనిపెట్టడం తమ మొదటి ప్రాధాన్యమని ఆయన అన్నారు. సిఐఎ కార్యకలాపాల ఉధృతి, పాకిస్తానీ సైనిక చర్య లాడెన్ పట్టుకోవడానికి చక్కని అవకాశం కల్పిస్తాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆల్ ఖైదా వ్యవస్థపై దాడికి లక్ష్యాన్ని, సమాచారాన్ని అందించేందుకు పాకిస్తాన్ లో అధికారుల సంఖ్యను, ఏజెంట్లను సంఖ్యను పెంచినట్లు పానెట్టా తన ప్రసంగంలో చెప్పారు.












Click it and Unblock the Notifications