సమీర ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం
హైదరాబాద్: హైదరాబాదులోని చార్మినార్ ఘటనలో తీవ్రంగా గాయపడిన సమీరాబేగం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. చాలా ఎత్తునుంచి కిందకు పడటంతో తలపై తీవ్ర గాయమైంది. దీంతో 14 కుట్లు వేశారు. రెండు కాళ్లు, ఓ చేయి విరిగిపోవటంతో సిమెంటు కట్లు వేశారు. వెన్నుపూస కూడా దెబ్బతింది. శరీరంపై చాలాచోట్ల తీవ్రగాయాలు కావటంతో రాత్రి నుంచి ఆమె అనస్మారకంలోనే ఉంది.
మరోవైపు నిందితుడు అర్షాద్‌కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం అతని తల్లిదండ్రులను పోలీసులు విచారిస్తున్నారు. అర్షాద్ అప్పులు ఇస్తుంటాడని, తాము కూడా అతని వద్ద అప్పులు తీసుకున్నామని సమీర తల్లిదండ్రులు చెప్పారు. డైలీ ఫైనాన్స్ నడిపే అతను తాము అప్పు తీర్చలేదనే తమ కూతురును చార్మినార్ పై నుంచి తోసేశాడని వారంటున్నారు.












Click it and Unblock the Notifications