ఇరాన్ అధ్యక్షుడిగా నెజాద్ ఎన్నిక
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో అహ్మదీ నెజాద్ ఘన విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థి హుస్సేన్ మౌసవిపై 65 శాతం ఓట్లు అధికంగా సాధించారు. ఆయన అధ్యక్షుడిగా గెలుపొందటం ఇది రెండవసారి. నెజాద్ విజయం సాధించినట్లు శనివారం ఫలితాలు వెల్లడించాయి. అమెరికాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అణు పాటవాన్ని సమాయత్తం చేసుకుంటున్న నౌజాదీ విజయం సాధించడం విశేషం.
ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మౌసవి ఆరోపిస్తున్నారు.బ్యాలెట్ పత్రాలు సరైనన్ని లేకపోవడం, తన ప్రచార కార్యాలయాలపై దాడులు చేయడం వంటి అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆయన అంటున్నారు. టెహ్రాల్ వీధులు నైజాద్ విజయాన్ని ఆహ్వానిస్తూ సంబరాలతో నిండిపోయాయి. ఇరాన్ జాతీయ పతాకలతో ప్రజలు ప్రదర్శనలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications