తెలుగువాడికి కెనడా పురస్కారం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని కెనడా హై కమిషన్‌లో సీనియర్ సలహాదారుగా పనిచేస్తున్న సంపత్ కుమార్‌కు.. అత్యుత్తమ ప్రతిభను కనబరిచినందుకు కెనడా ప్రభుత్వం అవార్డు బహూకరించింది. శనివారం భారత దేశంలో కెనడా హై కమిషనర్ జోసెఫ్ కరాన్ ఆయనకు ఈ అవార్డును అందజేశారు. అదిలాబాద్ జిల్లాకు చెందిన సంపత్ కుమార్ 1999 నుంచి ఢిల్లీలోని కెనడా హైకమిషన్‌లో సలహాదారుగా పనిచేస్తున్నారు.
ఢిల్లీలోని ఐఐటీలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ చేసిన సంపత్‌కుమార్.. కెనడా హైకమిషన్‌లో చేరక ముందు పలు ఎన్జీవోలలోనూ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలోనూ పనిచేశారు. ఆయన తెలుగు సాహిత్యంలోనూ ప్రతిభ కనపరిచారు. లియోసా పేరుతో ఆయన వెలువరించిన కథల సంపుటి కథా ప్రేమికుల ఆదరణను చూరగొంది. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఆయన పలు రచనలు చేశారు.












Click it and Unblock the Notifications