కెసిఅర్ ను మళ్ళీ దులిపేసిన చంద్రశేఖర్
హైదరాబాద్: టీఆర్ ఎస్ అధ్యక్షుడు కెసిఅర్ పై అసమ్మతి నేత డాక్టర్ ఎ.చంద్రశేఖర్ మంగళవారం కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఆత్మవంచన చేసుకుంటూ ఎన్నాళ్లు బతుకుతారని ఆయన కెసిఅర్ ను సూటిగా ప్రశ్నించారు. నిజజీవితంలో ఇకనైనా ఆత్మవంచన లేకుండా బతకటానికి ప్రయత్నించాలని హితవు పలికారు. రవీంద్రనాయక్ పై ఉద్దేశపూర్వకంగానే దాడి చేయించారని చంద్రశేఖర్ ఆరోపించారు.
నిన్న జరిగిన కార్యవర్గ సమావేశంలో విజయ రామారావు చెప్పిన డాక్టర్, పేషెంట్ కథ విన్న వెంటనే అయినా కెసిఅర్ రాజీనామా చేయాల్సిందన్నారు. ఆ కథకు కార్యవర్గ సభ్యులంతా చప్పట్లు కొట్టి మద్దతు ఇవ్వటం నిజం కాదా అని ప్రశ్నించారు. ఇకనైనా తెలంగాణ మేధావులు మౌనం వీడాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications