మహిళా పోలీసు హత్య మిస్టరీ వీడింది
హైదరాబాద్: కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు ఫోర్త్ ఫేజ్ లో లో హత్యకు గురైన మహిళా కానిస్టేబుల్ కుసుమకుమారి హత్యకేసు మిస్టరీ వీడింది. కుసుమకుమారిని తానే చంపినట్లు ఆమె భర్త భిక్షపతి తెలుపుతూ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆమె కొందరు పురుషులతో సన్నిహితంగా ఉంటోందని, తన భార్య ప్రవర్తన నచ్చకే ఆమెను చంపాల్సి వచ్చిందని ఆ లేఖలో పేర్కొన్నాడు. కుసుమకుమారి ఆదివారం తన ఇంట్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. కుసుమకుమారిని భర్తే హత్య చేసుంటాడని అనుమానాలు వ్యక్తం కావడంతో ఆదిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications