డిజిపిపై ఇసికి టిడిపి ఫిర్యాదు

ఎన్నికల కమిషన్ పైనే లేఖాస్త్రాలు సంధిస్తున్న డీజీపీ వైఖరిని ముఖ్యమంత్రి సరిదిద్దాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు నాగం జనార్దన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు బుధవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో సూచించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి స్పందించడం లేదంటే ఆయన ప్రోద్బలం కూడా దీని వెనక ఉన్నట్లే భావించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల సంఘానికి లేఖ రాసేందుకు ప్రభుత్వ అనుమతిని డీజీపీ యాదవ్ తీసుకున్నదీ లేనిదీ చెప్పాలన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలకు ముందు సీనియర్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసిందని గుర్తుచేశారు. ఆయా రాష్ట్రాల్లో వారెవరూ అభ్యంతరం చెప్పలేదని, యాదవ్ మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని వారు విమర్శించారు. ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించే హక్కు డీజీపీకి లేదని వారు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications