కర్నూలు: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్ల గర్భగుడిలోకి శుక్రవారం ఉదయం కాకి ప్రవేశించింది. దాంతో ఆలయ ప్రధాన అర్చకులు దర్శనం నిలిపివేశారు. గర్భగుడిలోకి కాకి ప్రవేశించడాన్ని అరిష్టంగా భావిస్తారు.
కాకి రావటాన్ని అరిష్టంగా భావించిన అర్చకులు ఆలయ సంప్రోక్షణ చేశారు. ప్రత్యేక పూజలకు, దర్శనానికి అంతరాయం ఏర్పడింది. సంప్రోక్షణ అనంతరం, పూజలకు, దర్శనానికి అనుమతించారు.