టీఆర్‌ఎస్ కి కేసీఆర్ రాజీనామా

టీఆర్‌ఎస్ పార్టీని దెబ్బ తీయడానికి కొందరు కుట్రపన్నారని ఆ పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేసిన కేసీఆర్ అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఉద్యమం ఆగదని ఆయన స్ఫష్టం చేశారు. అసమ్మతి నేతల విమర్శలతో కలత చెందానని, తనపెైనా, తన కుటుంబంపెైనా వ్యక్తిగత దాడి చేశారని కేసీఆర్ అవేదన వ్యక్తం చేశారు.గత నెల రోజులుగా తన కుటుంబంపెై అభూత కల్పనలు వస్తున్నాయని అందుకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామాను అమోదించాలని పార్టీ ప్రధాన కార్యదర్శిని కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది.
టీఆర్‌ఎస్‌లో సంక్షోభం ముదిరే అవకాశముందని గమనించిన కేసీఆర్ అధ్యక్ష పదవికి కేసీఆర్ రాజీనామా చేసినట్లు సమాచారం. ఇక కేసీఆర్ రాజీనామా నిర్ణయాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు సైతం సమాచారం అందించినట్లు మధుసూదనాచారి తెలిపారు. కేసీఆర్ హఠాత్తుగా తీసుకున్న రాజీనామా నిర్ణయంపై పార్టీ నేతల్లో కలకలం నెలకొంది. కేసీఆర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ఇది రెండో సారి. గత ఏడాది ఉప ఎన్నికల ఫలితాల అనంతరం రాజీనామా చేసి వెనక్కి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications