పవన్ కల్యాణ్ కొనసాగుతాడు: చిరు

Chiranjeevi
తిరుపతి: తన సోదరులకు ఇమేజ్‌ దృష్ట్యా ఇతర బాధ్యతలు ఉన్నందున, అవసరమైనపుడు వారి సేవలు పార్టీకి అందిస్తారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. యువరాజ్యం అధ్యక్షడిగా పవన్‌ కల్యాణ్‌ కొనసాగుతారని ఆయన తెలిపారు. తమ పార్టీ ఓటమికి రైలింజన్‌ గుర్తు కూడా ఒక కారణమనీ, ఇకపై ఈ గుర్తుకు ఉద్వాసన పలుకుతున్నామని చిరంజీవి వెల్లడించారు. గురువారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన 'మీట్‌ ద ప్రెస్‌' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కుదించిన గుర్తు ఓటర్లను తికమకపెట్టడంతో తమకు అన్యాయం జరిగిందని అనేక మంది అభ్యర్థులు తనకు ఫిర్యాదు చేశారని చెప్పారు.

రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కొంతమంది ట్రాక్టరు, బుల్‌డోజరు తదితర గుర్తులు ఎంపిక చేసుకుని ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. టిక్కెట్లు అమ్ముకోవడంతో పార్టీ ఓటమి పాలయ్యిందనేది గోబెల్స్‌ ప్రచారమనీ, తన నిజాయితీ ఏమిటో రాష్ట్ర ప్రజలకు 30 ఏళ్లుగా తెలుసన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలపడలేకపోవడమే ఓటమికి కారణమన్నారు. జోడుగుర్రాల స్వారీలా కాకుండా సినీరంగానికి దూరంగా ప్రజాసేవకు అంకితమవుతానని హామీ ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై డీజీపీ యాదవ్‌ లేఖలు రాయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంతంగా ముందుకు వెళతామనీ, ఇతర పార్టీలతో పొత్తుపై ఏమీ ఆలోచించలేదని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+