ముంబయి: శివసేన అధ్యక్షుడు బాల్ థాకరే అస్వస్థత కారణంగా శుక్రవారం జరగాల్సిన శివసేన 43వ వ్యవస్థాపక దినోత్సవం రద్దయింది. అస్వస్థతతో ఉన్న థాకరే గత రాత్రి లీలావతి ఆసుపత్రిలో చేరారు. ఇటీవల తరచు ఆయన ఆసుపత్రిలో చికిత్స కోసం చేరుతున్నారు. ఇప్పుడు కూడా ఆయన వైద్య పరీక్షల నిమిత్తం చేరారని, ఆందోళన చెందవలసిందేమీ లేదని శివసేన అధికార ప్రతినిధి నీలం గోర్తే అన్నారు. అయితే ఆయన శుక్రవారం ఉత్సవాలకు హాజరై కూర్చునే పరిస్థితి లేనందున ఉత్సవాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది.
వయసు మీద పడడం వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యల వల్ల ఆయన తరుచూ ఆస్పత్రికి వస్తున్నారు. 82 ఏళ్ల బాల్ థాకరే పార్టీ రోజువారీ వ్యవహారాల నిర్వహణను తన కుమారుడు ఉద్ధవ్ థాకరేకు అప్పగించారు.