వరకట్నం వేధింపులకు జడ్జిల అరెస్టు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు న్యాయమూర్తులను పోలీసులు వరకట్నం కేసులో అరెస్టు చేశారు. వారిద్దరు తండ్రీకుమారులు. వారిద్దరిని పోలీసులు స్థానిక కోర్టులో హాజరు పరిచారు. వారిని జ్యుడిష్యల్ కస్టడీకి పంపాలని కోర్టు ఆదేశించినట్లు పోలీసులు శనివారం చెప్పారు. అనంతపురం జూనియర్ సివిల్ జడ్జి టి. కిరణ్ కుమార్, మహబూబ్ నగర్ జిల్లా న్యాయమూర్తి టి. నర్సింహారావులను పోలీసులు అరెస్టు చేశారు.
వారిపై కిరణ్ కుమార్ భార్య శశికళ వరకట్నం వేధింపుల కింద ఫిర్యాదు చేసినట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ (డిటెక్టివ్ డిపార్ట్ మెంట్) ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. శశికళకు కిరణ్ కుమార్ తో 2005లో పెళ్లయింది. కిరణ్ కుమార్ ను సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications