తిరుపతి: ప్రజారాజ్యం అధినేత, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతుండటంతో శుక్రవారం హైదరాబాద్ వెళ్లిపోయారు. నిర్దేశిత పర్యటన ప్రకారం బుధ, గురువారాల్లో నగరంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన,గురువారం సాయంత్రం చెన్నై వెళ్లాల్సి ఉంది.అనంతరం శుక్రవారం ఉదయం మళ్లీ తిరుపతి వచ్చి కార్యకర్తల భేటీలో పాల్గొనాల్సి ఉంది. అయితే అర్ధరాత్రి నుంచే అస్వస్థతకు గురికావడంతో కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని ఉదయం 7.30 గంటలకు హైదరాబాదు వెళ్లారు.