సివిఎస్కే శర్మకు హైకోర్టు జరిమానా

CVSK Sarma
హైదరాబాద్‌: కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకుగాను అప్పటి గ్రేటర్‌ హైదరాబాద్‌ కమిషనర్‌ సి.వి.ఎస్‌.కె.శర్మ, సహాయ నగర ప్రణాళిక అధికారి వి.ఎస్‌.షామాలకు శుక్రవారం హైకోర్టు రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో వారం రోజులు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్‌ మొయినుద్దీన్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ ఎ.గోపాల్‌రెడ్డి శుక్రవారం తీర్పు వెలువరించారు.

తనకు తెలియకుండా కోర్టు ఉత్తర్వుల అమలులో ఏదైనా పొరపాటు జరిగి ఉంటే క్షమించాలని శర్మ కోరడం కేవలం నేర తీవ్రత తగ్గించుకోవడానికి చేసిన ప్రయత్నమేనని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నాటకీయంగా పశ్చాత్తాపం ప్రకటించడం ద్వారా కోర్టు ధిక్కార నేరం నుంచి ఉపశమనం పొందలేరన్నారు. శర్మ క్షమాపణలను తాము ఆమోదించిన పక్షంలో మరింత చనువుగా వ్యవహరించి న్యాయస్థానం ప్రతిష్ఠ దెబ్బతీసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని మొజంజాహీ మార్కెట్‌ ప్రాంతంలో మొయినుద్దీన్‌ 35 చదరపు గజాల దుకాణాన్ని 2001లో కొనుగోలు చేశారు. రహదారి వెడల్పు నిమిత్తం కార్పొరేషన్‌ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా దుకాణాల కూల్చివేత కార్యక్రమం చేపట్టడంతో మొయినుద్దీన్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై 2003లో హైకోర్టు విచారణను ముగిస్తూ 1998లో ఇదే కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలని ఆదేశించింది. రాజీ కుదరని పక్షంలో భూసేకరణ చట్టం ప్రకారం కార్పొరేషన్‌ చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. ఐనప్పటికీ మొయినుద్దీన్‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గత ఏడాది ఏప్రిల్‌ 28న కూల్చివేత చేపట్టారు. పిటిషనర్‌ దుకాణం పాక్షికంగా కూలిపోయింది. 29న పరిహారం కోరడంతోపాటు మిగిలిన ప్రదేశంలో నిర్మాణం చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని కార్పొరేషన్‌ను అభ్యర్థించారు. అయినా ఫలితం లేకపోవడంతో కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు.

కమిషనర్‌ శర్మ, షామా కౌంటర్లు దాఖలు చేస్తూ మొయినుద్దీన్‌ చెబుతున్న స్థలం ఇస్మత్‌ పాష తదితరులకు చెందినదిగా రికార్డుల్లో ఉందని, వారంతా స్థలం ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు. పరిహారంగా రూ. 2,33,384 చెల్లించినట్లు పేర్కొన్నారు. స్థలం యజమాన్య హక్కులకు సంబంధించి మొయినుద్దీన్‌ పేరు తమ రికార్డుల్లో లేదని అందువల్ల పిటిషనర్‌కు నోటీసులు జారీ చేయలేదని చెప్పారు. కూల్చివేత నాటికి స్థలం చట్టప్రకారం ఎవరి అధీనంలో ఉందో వారికి నోటీసులు ఇవ్వాల్సి ఉండగా పాత యజమానుల అంగీకారంతో కూల్చామనడం సరికాదంది. అధికారుల చర్య ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం తప్ప మరోటి కాదని, కోర్టు ధిక్కారమేనని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+