జులై వేతనాలు వదులుకోండి: ఎయిర్ ఇండియా
న్యూఢిల్లీ: జులై వేతనాలను స్వచ్ఛందంగా వదులుకోవాలని ఎయిర్ ఇండియా శుక్రవారం టాప్ మేనేజ్ మెంట్ కు, సీనియర్ అధికారులకు విజ్ఞప్తిచేసింది. ఉత్వాదక సంబంధ రాయితీలను కూడా వదులుకోవాలని కోరింది. ఎయిర్ లైన్స్ ను లిక్విడిటీ సంక్షోభం నుంచి బయట పడేయడానికి జులై వైతనాలను, ఇన్సెంటివ్ లను స్వచ్ఛందంగా వదులుకోవాలని ఎయిర్ ఇండియా సిఎండి అర్వింద్ జాదవ్ జనరల్ మేనేజర్లకు, ఆ పైస్థాయి అధికారులకు విజ్ఢప్తి చేశారు.
ఈ నెలాఖరులోగా జూన్ వేతనాలు ఈ నెలాఖరులోగా చెల్లించకపోతే ఆందోళనకు దిగుతామని ఉద్యోగులు హెచ్చరించడంతో ఎయిర్ లైన్ పారిశ్రామిక అశాంతిని ఎదుర్కునే ప్రమాదం వాటిల్లింది. కంపెనీ ఆర్థిక పరిస్థితిపై జాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications