బిజెపికి నరేష్ రాజీనామా?

Naresh
హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ నటుడు నరేష్ త్వరలో భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆయన పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి బాధ్యత వహించి తాను రాజీనామా చేసినట్లు ఆయన శనివారం ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ తో అన్నారు. పార్టీ నాయకత్వంపై ఆయన విమర్శలు చేశారు. మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తానని ఆయన అన్నారు.

ఎన్నికల్లో పార్టీలోని ఒక వర్గం తనను ఓడించడానికి పని చేసిందని, ఈ విషయాన్ని పార్టీ నాయకత్వానికి చెప్పినా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. పార్టీ వ్యవహారాలను ఎవరూ పట్టించుకునే స్థితిలో కూడా లేరని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో అనంతపురం జిల్లాలో తనకు తీవ్ర అవమానం జరిగిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+