కాశ్మీర్ పై మధ్యవర్తిత్వం చేయం: ఒబామా

కాశ్మీర్ సమస్యపై తాము మౌనంగా ఉండడం పాకిస్తాన్ కో, భారత్ కో తాము మిత్రులు కావడం వల్లనే కాదని తాను అనుకోవడం లేదని, ఇద్దరు మిత్రులు కలహించుకోవడం తమను కలత పెడుతుందని ఆయన అన్నారు. విభేదాలు ఎలా పరిష్కరించుకోవాలనే విషయంపై తాము భారత్ ను, పాకిస్తాన్ ను ఆదేశించలేమని ఆయన చెప్పారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఇరు దేశాలకు తాము సహకరిస్తాం తప్ప మధ్యవర్తిత్వం నెరపబోమని ఆయన స్పష్టం చేశారు. చర్చలు ఉద్రిక్తతల నివారణకు మంచి మార్గమనే ఉద్దేశంతో పాకిస్తాన్ తో చర్చలు జరపాలని తాము భారత్ కు సూచించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications