కెసిఆర్ రాజీనామా ఉపసంహరణకు ధర్నా
హైదరాబాద్: పార్టీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోవాలని కె.చంద్రశేఖర రావును డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు శనివారం ఉదయం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద ధర్నాకు దిగారు. కెసిఆర్ రాజీనామా చేస్తే తెలంగాణ ఉద్యమానికి, తెరాసకు నష్టం జరుగుతుందని, కెసిఆర్ అధ్యక్షుడుగా లేని తెరాసను ఊహించలేమని తెరాస నాయకులు అంటున్నారు.
తెలంగాణ వ్యతిరేకుల కుట్రలో భాగంగానే కెసిఆర్ పై అసమ్మతివాదులు విమర్శలు చేస్తున్నారని కెసిఆర్ మద్దతుదారులు అంటున్నారు. కెసిఆర్ రాజీనామాపై చర్చించేందుకు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు తెరాస సర్వసభ్య సమావేశం జరుగుతుంది. రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరుతూ సమావేశం తీర్మానం చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications