పీఅర్పీకి ఎన్నికల సంఘం గుర్తింపు
హైదరాబాద్: చిరంజీవి ప్రజారాజ్యంను రాష్ట్రపార్టీగా భారత ఎన్నికల సంఘం గుర్తిస్తూ పార్టీ అధ్యక్షుడికి ఓ లేఖను పంపింది. శనివారం ఇక్కడ ఆ లేఖను ప్రరాపా ప్రకటించింది. దీంతో ఆ పార్టీ తాను కోరుకునే గుర్తును కేటాయించాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరే అవకాశం లభించింది. గుర్తింపు పొందని నమోదైన పార్టీగా ప్రరాపా ఎన్నికల్లో పోటీ చేసింది.
శాసనసభ ఎన్నికల్లో పార్టీల పోలింగు శాతాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం లేఖలో తెలిపింది. 1968 ఎన్నికల గుర్తులు, రిజర్వేషన్ కేటాయింపు ఆర్డర్‌లోని పేరా 6ఎ(III) నిబంధనల మేరకు అర్హత పొందినందున పార్టీని రాష్ట్రపార్టీగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. తాను కోరుకున్న గుర్తు కేటాయించమని కోరుతూ ప్రరాపా సంఘానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.












Click it and Unblock the Notifications