కేసీఆర్‌ కాళ్లు పట్టుకోవాల్సిందే

హైదరాబాద్‌: అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కేసీఆర్‌ తెరాస సిద్ధాంత కర్త కాళ్లు పట్టుకుంటే సరిపోదని తెలంగాణ ప్రజల కాళ్లు పట్టుకోవాలని తెలంగాణ విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ రోజు ఉదయం పార్టీ సిద్ధాంత కర్త జయశంకర్‌తో సమావేశమైన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉద్యమం తనకు ఎదురు తిరిగిన ప్రతీసారీ సిద్ధాంత కర్తలను, మేధావులను రక్షణ కవచాలుగా కేసీఆర్‌ ఉపయోగించుకుంటున్నారని వారు ఆరోపించారు.

కేసీఆర్‌కు తిరిగి అవకాశమివ్వద్దని ప్రొ|| జయశంకర్‌, కోదండరామిరెడ్డిలను కోరారు. కేసీఆర్‌ మళ్లీ అధ్యక్ష పదవి పొందేందుకు నాటకం ఆడుతున్నారని టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతలు పేర్కొన్నారు. కేసీఆర్‌ వాస్తవాలు తెలుసుకున్నట్లయితే తన తప్పులను రాజీనామా పత్రంలో ఎందుకు పేర్కొనలేదని అసమ్మతి నేతలు ప్రశ్నించారు. ఈ సమయంలో అక్కడకు చేరుకున్న విద్యార్థి సంఘ నాయకులు అసమ్మతి నేతలను మీ ఉద్దేశం ఏమిటో చెప్పమని నిలదీశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+