హైదరాబాద్: గత ఎన్నికల్లో మేడవ కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు, పొత్తుల వ్యవహారాలు సరిగా కుదరలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి ఏబీ బర్దన్ అన్నారు. ఆ లోపాలే ఓటమికి కారణమని ఆయన అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో వామపక్షాల మధ్య ఒక్కసీటు విషయంలో నెలకొన్న వివాదం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపిందని అన్నారు. అయితే తమ పార్టీల భవిష్యత్ సంబంధాలపై దీని ప్రభావం ఉండదని, సర్దుబాటుతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు.