అకస్మాత్తుగా ఆగిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్
తిరుపతి: హాయిగా సర్దుకుని కూర్చున్న ప్రయాణీకులు అకస్మాత్తుగా రైలు ఆగేసరికి ఏం జరిగిందో తెలియక తికమక పడ్డారు. సిగ్నల్ వచ్చి ఉండదనుకుని సర్దుకున్నారు. అయితే నిముషాలు గంటలైనా రైలు కదలకపోవటంతో ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఇంజన్లో సాంకేతికలోపం తలెత్తటంతో ఎస్వీ యూనివర్శిటీ సమీపంలో స్టేషన్ కు కొద్దిదూరంలో నిలిచిపోయింది. ఎంతకీ రైలు కదలక ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు రైల్వే అధికారులు మరో రైలింజన్ ను తెప్పించి రైలును తిరుపతికి మళ్లించారు.












Click it and Unblock the Notifications