లగడపాటిపై హనుంతుడి చిందులు
హైదరాబాద్: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్రంగా మండిపడ్డారు. తాను రాజకీయాల్లో స్వయం శక్తితో ఎదిగానని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో రాజగోపాల్ కు, హనుమంతరావుకు మధ్య తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. రాజగోపాల్ తనను ఏకాకిని అంటున్నారని, ప్రజల్లోకి వస్తే తన సత్తా ఏమిటో చూపిస్తానని ఆయన అన్నారు.
ప్రాణాలు ఉన్నంత వరకు తాను కాంగ్రెసులోనే ఉంటానని ఆయన చెప్పారు. ఒలింపిక్ సంఘం ఎన్నికలు పూర్తిగా అప్రజాస్వామికంగా జరిగాయని ఆయన విమర్శించారు. ల్యాంకో ఉద్యోగులను పెట్టే ఎన్నికల వ్యవహారమంతా రాజగోపాల్ నడిపించారని ఆయన అన్నారు. ఓలింపిక్ సంఘం సిబ్బందిని రానివ్వలేదని ఆయన అన్నారు. రిటర్నింగ్ అధికారి ఎంపిక విషయంలోనూ పద్ధతి పాటించలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications