ఖమ్మంలో పూజారి దారుణ హత్య
ఖమ్మం: ఖమ్మంలో మంగళవారం ఉదయం ఒక పూజారి దారుణ హత్యకు గురయ్యాడు. ఖమ్మంలోని వేణుగోపాల్ నగర్ లో సంపత్ కుమార్ అనే పూజారిని దుండగులు పెట్రోల్ పోసి తగులబెట్టారు. దీంతో ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉంది. అయితే, సంపత్ కుమార్ ను వేరే చోట హత్య చేసి ఇక్కడికి తీసుకు వచ్చి పెట్రోల్ పోసి శవాన్ని తగులబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. వైవాహికేతర సంబంధం వల్లనే అతను హత్యకు గురై ఉంటాడనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications