మావోలపై బ్యాన్ కు బెంగాల్ ఓకె
కోల్ కత్తా: మావోయిస్టులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అంగీకరించింది. తమ రాష్ట్రంలో కూడా మావోయిస్టులపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటగా మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిషేధం విధించటానికి మంత్రివర్గం సుముఖత చూపలేదు.
కేంద్రం నుంచి వస్తున్న ఒత్తిడుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కేసులను ఐపీసీ సెక్షన్ల కింద నమోదు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర నిర్ణయాన్ని తాము అంగీకరిస్తున్నామని, అయితే దాన్ని ఎలా అమలు చేయాలనేది తాము చూసుకుంటామని ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య అన్నారు.












Click it and Unblock the Notifications