68కి చేరిన స్వైన్ ఫ్లూ కేసులు
న్యూఢిల్లీ: కొత్తగా మంగళవారం మరో ఐదు కేసులు నమోదు కావడంతో భారతదేశంలో నమోదైన స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 68కి చేరింది. అయితే స్వైన్ ఫ్లూ రోగుల్లో ఇప్పటికే 41 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. కొత్తగా ఢిల్లీలో మూడు, హైదరాబాద్, బెంగుళూరుల్లో ఒక్కటేసి స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
వ్యక్తి నుంచి వ్యక్తికి పాకిన రోగుల సంఖ్య ఢిల్లీలో ఆరుకు చేరింది. తాజాగా ఒక వ్యక్తి ద్వారా అతని బంధువుకు ఈ వ్యాధి సోకింది. తన కుమారుడి నుంచి అంటుకోవడంతో 64 ఏళ్ల మహిళకు స్వైన్ ఫ్లూ వ్యాధి సోకింది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను వెంటిలేటర్ మీద ఉంచారు. ఆమె ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications