పిఎం మీడియా సలహాదారు ఖరే
న్యూఢిల్లీ: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా సీనియర్ జర్నలిస్టు హరీష్ ఖరే బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత అయిన ఖరే ఇంతకు ముందు ది హిందూ పత్రిక సీనియర్ అసోసియేటెడ్ ఎడిటర్ గా, బ్యూరో చీఫ్ గా పని చేశఆరు.
62 ఏళ్ల ఖరే యాలే విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ శాస్త్రంలో పిహెచ్ డి పట్టా తీసుకున్నారు. ది టైమ్స్ ఇండియా అహ్మదాబాద్ ఎడిషన్ కు ఆయన సంపాదకుడిగా కూడా పనిచేశారు. హిందుస్తాన్ టైమ్స్ సీనియర్ సంపాదకుడిగా కూడా విధులు నిర్వహించారు. దీపక్ సంధూ స్థానంలో ఖరే ప్రధాని మీడియా సలహాదారుడిగా నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications