హైదరాబాద్: ప్రవాసాంధ్రుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కువైట్‌కు చెందిన తెలుగు సాహితి సమితి బృందం బుధవారం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని కలిసింది. గల్ఫ్ దేశాల్లో ఆంధ్రులు పడుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. ఎన్నారై విద్యార్థుల కోసం కువైట్ లో యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు కువైట్ తెలుగు సాహితీసమితి అధ్యక్షుడు హరిప్రసాద్ తెలిపారు.
ఆస్ట్రేలియా, అమెరికాలో కంటే గల్ఫ్ దేశాల్లోనే తెలుగువారిపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని సంస్థ ప్రతినిధి జ్యోత్న్స తెలిపారు. దుబాయ్ లో ఎన్నారైలపై జరుగుతున్న దాడులను పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు.