సిటీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాదులో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం పోవడంతో మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సచిన్ ఖండేల్వాల్ అనే ఆ ఉద్యోగి మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందినవాడని తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకున్న సచిన్ ఒక లేఖ కూడా రాసి పెట్టాడు.
తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని అతను ఆ లేఖలో స్పష్టం చేశాడు. హైదరాబాదులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న సచిన్ ఉద్యోగం పోయింది. కాచిగుడాలో ఉంటున్న అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications