తెరాస అసలుందా: కోటగిరి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసలు ఎక్కడుందని ప్రజారాజ్యం సీనియర్ నేత కోటగిరి విద్యాధరరావు ప్రశ్నించారు. ప్రజలు రైలింజన్ గుర్తుకు అలవాటు పడ్డారని, దీనిని మారిస్తే గందరగోళం ఏర్పడవచ్చన్న భావన పార్టీలో ఉందన్నారు. దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన మంగళవారం రాత్రి కొద్ది మంది మీడియా ప్రతినిధుల వద్ద అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం తెలుగుదేశం, కాంగ్రెస్‌లతో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకునే అవకాశం లేదని పేర్కొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పొత్తులకు ఇంకా సమయముందని మంగళవారం చిరంజీవి చేసిన వ్యాఖ్యకు అర్థం తెదేపాతో కూడా అవకాశమున్నట్లేనా అని విలేకరులు పదేపదే ప్రస్తావించగా 'కొందరు అలా కూడా అర్థం చేసుకునే అవకాశముంది, కానీ చిరంజీవి అలా అనలేదు కదా' అని బదులిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా ఎవరిని నియమించాలన్న దానిపై మూడు రోజులుగా అభిప్రాయాల్ని సేకరిస్తున్నామని, బుధవారం చిరంజీవికి నివేదిక ఇస్తామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications