బిగ్ బ్రదర్ షోకు శ్రీ గుడ్ బై?
లండన్: బిగ్ బ్రదర్ షో నుంచి భారత విద్యార్థి శ్రీ దాసరి తప్పుకోవాలని అనుకుంటున్నాడు. తనను ఇతర సహచరులు అబద్ధాలకోరు అని తిట్టడంతో అతను హౌస్ నుంచి వెళ్లిపోవాలని భావిస్తున్నాడు. రష్యన్ బాక్సర్ అంజెల్ ఆల్కహాల్ విషయంలో సహచరులు వ్యవహరించిన తీరుకు అతనికి ఆగ్రహం వచ్చింది.
శ్రీ దాసరి డైరీ రూమ్ కు వెళ్లి తాను ఇక ఎంత మాత్రమూ బిగ్ బ్రదర్ రియాల్టీ షోలో కొనసాగదలుచుకోలేదని చెప్పాడు. ఈ రాత్రి తాను చాలా మంది వాస్తవ రూపాలు చూశానని అతను అన్నాడు. అయితే ఇప్పుడే వెళ్లిపోవడం కుదరదని ఇతరులతో సంధి కుదుర్చుకోవాలని చెప్పారు. అయితే విభేదాలను పరిష్కరించుకోవడానికి బదులు శ్రీ నోయిరిన్ తో గొడవ పడ్డాడు.












Click it and Unblock the Notifications