తలసానిపై క్రమశిక్షణా చర్య?

తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారంపై చంద్రబాబు గురువారం సాయంత్రం పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత పార్టీ క్రమశిక్షణా సంఘం సమావేశమై శ్రీనివాస యాదవ్ పై చర్యకు సిఫార్సు చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం నాయకుడు తీగెల కృష్ణా రెడ్డి తలసాని విమర్శల వెనక కాంగ్రెసు కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఈ స్థితిలో ఆయనకు నచ్చజెప్పినా ఫలితం ఉండదనే అభిప్రాయం వినిపిస్తోంది.
శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెసులో చేరుతున్నట్లు తనకు ఏ విధమైన సమాచారం లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ గుంటూరులో అన్నారు. ఆ విషయంపై తనను ఎవరూ సంప్రదించలేదని ఆయన అన్నారు. అయితే, తలసానికి కాంగ్రెసుకు ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications